Share News

Loksabha Polls: జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా.. రూ.75 లక్షల నగదు సీజ్

ABN , Publish Date - Apr 05 , 2024 | 09:30 PM

లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.

Loksabha Polls: జొమాటో బాయ్ ద్వారా నగదు రవాణా.. రూ.75 లక్షల నగదు సీజ్
Task Force Cop Seize Rs 75 lakh Zomato Boy Held for Transporting Cash

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో (Hyderabad) భారీగా పట్టుబడింది. మూడు ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జొమాటో డెలివరీ బాయ్ (Zomato) నగదు రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. నగదు పట్టివేతకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.


కారులో రూ.40 లక్షలు

అబిడ్స్ పోలీస్ పరిధిలో గల రామకృష్ణ థియేటర్ పార్కింగ్ వద్ద ఎండీవర్ కారును తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.40 లక్షల నగదు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు దేవిని ముత్యాలు, రాజేష్‌ను అరెస్ట్ చేశారు. హఫీజ్ పేటకు చెందిన విల్సన్ బాబు వద్ద పనిచేస్తున్నామని ఆ ఇద్దరు పోలీసులకు తెలిపారు. విల్సన్ సూచనతో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకున్నామని వివరించారు.


డెలివరీ బాయ్ వద్ద రూ.14 లక్షలు

ఆసిఫ్ నగర్‌లో గల మల్లెపల్లి సర్కిల్ వద్ద ఉన్న అమృత వైన్స్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. జొమాటో డెలివరీ బాయ్ నుంచి రూ.14 లక్షల నగదు లభించింది. ఆ నగదుకు సంబంధించి డిటైల్స్ లేకపోవడంతో సీజ్ చేశారు. కడపకు చెందిన నాగార్జున హైదరాబాద్ వచ్చి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని వివరంచారు. 2013లో కువైట్‌లో ఉన్న సమయంలో మస్తాన్ వలీ పరిచయం అయ్యాడు. హైదరాబాద్ వచ్చి డెలివరీ బాయ్‌గా పనిచేస్తోన్న నాగార్జునకు మస్తాన్ వలీ ఫోన్ చేశాడు. మంగళ్ హాట్ వద్ద గల ఫ్లై వుడ్ స్టోర్ నుంచి నగదు తీసుకొని రావాలని కోరాడు. అలా తీసుకొస్తే మంచి కమీషన్ ఇస్తానని చెప్పాడు. డబ్బుకు ఆశపడి తీసుకొచ్చే సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు.


మరో చోట రూ.20 లక్షలు

అబిడ్స్ ఎంజే మార్కెట్ వద్ద రూ.20 లక్షల నగదుతో పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. నగదుకు సంబంధించి పత్రాలు చూపించలేదు. నగదును సీజ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచనతో ఓటేయండి...


Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 02:47 AM