Share News

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

ABN , Publish Date - Feb 04 , 2024 | 01:49 PM

రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా ఇస్తామని అన్నారు.

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ క్రమంలోనే తెలుగోళ్లు ఎక్కడ ఉన్నా కూడా మనోళ్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి క్రమంలో మన తెలుగు భాష, మన కలలు, సంప్రదాయాలను గౌరవించుకోవాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక కలలను వృత్తిగా మార్చుకుని అందులోనే జీవించేవారిని గౌరవించాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Telangana: ఫిబ్రవరి 6న గాంధీ భవన్‌లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం

హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - Feb 04 , 2024 | 02:29 PM