Share News

Ravi Gupta: హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:58 AM

రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు.

Ravi Gupta: హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎ్‌సల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jul 19 , 2024 | 03:58 AM