Share News

రంగారెడ్డి: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:02 AM

హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... మంగళవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది.

రంగారెడ్డి:  ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... మంగళవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందకు పడిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డుపై నుంచి అత్యంత వేగంగా వచ్చిన కారు.. అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రలును కూడా సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ప్రయాణిస్తున్నవారందరూ యువకులే.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 20 , 2024 | 09:02 AM