Shanta Sinha: హింసకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి
ABN , Publish Date - Sep 02 , 2024 | 05:06 AM
తమపై జరుగుతున్న దారుణాలు, హింసపై మహిళలు గొంతు విప్పాలని, పోరాటాలు చేయాలని పీవోడబ్ల్యూ ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంతాసిన్హా పిలుపునిచ్చారు.
పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ శాంతా సిన్హా
రాంనగర్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): తమపై జరుగుతున్న దారుణాలు, హింసపై మహిళలు గొంతు విప్పాలని, పోరాటాలు చేయాలని పీవోడబ్ల్యూ ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ శాంతాసిన్హా పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభలు జరిగాయి. మహిళలు గౌరవంగా జీవించే పరిస్థితులు క్షీణించాయని, పాలకులు మహిళలను పట్టించుకునే స్థితిలో లేరని ప్రొఫెసర్ రమా మేల్కొటే అన్నారు. అంతకుముందు పీవోడబ్ల్యూ జెండాను రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆవిష్కరించారు.