Sripal Reddyఫ ఏఐఎఫ్‌టీవో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీపాల్‌రెడ్డి
ABN , Publish Date - Sep 17 , 2024 | 01:45 AM
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటిఓ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటిఓ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఏఐఎ్‌ఫటిఓ జాతీయ సాధారణ కౌన్సిల్ సమావేశాలు సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగాయి. ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2021 నుంచి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం(యూపీఎ్‌స)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేదాకా దేశంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేస్తూ పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.