Share News

Yadadri: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:39 AM

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరోవైపు మేడారంకు వచ్చిన భక్తులు కూడా యాదగిరి గుట్టకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది.

Yadadri: యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

యాదాద్రి: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మినరసింహ స్వామి (Sri Lakshminarasimhaswamy) వారి ఆలయానికి భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరోవైపు మేడారంకు వచ్చిన భక్తులు కూడా యాదగిరి గుట్టకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.

కాగా అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు సందర్భంగా మండల కేంద్రంలోని కమాన్‌ నుంచి మంగళవాయిద్యాల నడుమ విశేషార్చనలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, దరూరి యోగనందచార్యులు, మోరపాక సత్యం, రత్నం లక్ష్మాజీ స్వామి వారి వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 08:41 AM