Share News

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ అభ్యర్థికి... సూర్పనకకు పోటీ

ABN , Publish Date - Mar 05 , 2024 | 09:46 PM

ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి, సూర్పనకకు పోటీ జరగబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ అభ్యర్థికి...  సూర్పనకకు పోటీ

మహబూబాబాద్ : ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి, సూర్పనకకు పోటీ జరగబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మరిపెడలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితను సూర్పనకతో పోల్చారు. మార్పు కావాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని డోర్నకల్ నియోజక వర్గ ప్రజలు బలంగా కోరుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ప్రజలు మోసపోయి గోస పడ్డారన్నారు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు గ్యారెంటీలను ఇందిరమ్మ ప్రభుత్వం మీ ఇళ్లకు చేర్చిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 09:46 PM