Share News

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత

ABN , Publish Date - May 08 , 2024 | 07:47 AM

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్‌లో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలి పడడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత

హైదరాబాద్: భాగ్యనగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్‌లో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలి పడడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. హరిజాన్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Chardham Yatra 2024: నేటి నుంచి చార్ధామ్ యాత్ర 2024కు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

మృతులు వీరే..

1) మజ్జి తిరుపతి (20), ఒడిశా

2) శంకర్ (22), ఒడిశా

3) రాజు (25), ఒడిశా

4) కుషి (రాజు భార్య), ఒడిశా

5) రామ్ యాదవ్ (34), ఛత్తీస్‌ఘడ్

6) గీత (రామ్ యాదవ్ భార్య), ఛత్తీస్‌ఘడ్

7) హిమాన్షు (4 ఏళ్లు), ఛత్తీస్‌ఘడ్

ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2024 | 08:45 AM