Share News

Medical Equipment: నల్లగొండ నవజాత శిశు కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:04 AM

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Medical Equipment: నల్లగొండ నవజాత శిశు కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ కేంద్రానికి అధునాతన వైద్య పరికరాలు అందించడంతో పాటు ఇంకా అవసరం ఉన్న సౌకర్యాలను 24గంటల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.


హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద జనాభా కలిగిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతీ రోజూ 1500 మంది అవుట్‌ పేషెంట్లు, 1000 మందికి పైగా ఇన్‌ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రతీ నెలా సుమారు 600 ప్రసవాలు జరుగుతాయని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనే నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశానని, తిరిగి ప్రస్తుతం కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా అధునాతన పరికరాలు అందజేసినట్లు చెప్పారు.

Updated Date - Dec 26 , 2024 | 04:04 AM