Share News

GHMC: పారిశుధ్యకార్మికురాలితో అసభ్య చేష్టలు

ABN , Publish Date - May 24 , 2024 | 04:16 AM

ఆ ఇద్దరూ శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు! వీరిలో ఒకరు మహిళా పారిశుఽధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను తనకు తానే ఫోన్లో వీడియో తీస్తాడు. తర్వాత ఆ వీడియోలను బాధిత మహిళలకు చూపి లైంగిక వేధింపులకు గురిచేస్తాడు.

GHMC: పారిశుధ్యకార్మికురాలితో అసభ్య చేష్టలు

  • మహిళా కార్మికులతో అసభ్యకర ప్రవర్తన

  • వీడియో తీసి వారికి చూపిస్తూ వేధింపులు

  • ఇద్దరు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిర్వాకం

  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సీరియస్‌

  • ఆ ఇద్దరూ విధుల నుంచి తొలగింపు

  • ఇద్దరు ఫీల్డ్‌ అసిసెంట్ల నిర్వాకం

  • సోషల్‌ మీడియాలోవీడియో వైరల్‌

  • విధుల నుంచి తొలగింపు

హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరూ శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు! వీరిలో ఒకరు మహిళా పారిశుఽధ్య కార్మికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను తనకు తానే ఫోన్లో వీడియో తీస్తాడు. తర్వాత ఆ వీడియోలను బాధిత మహిళలకు చూపి లైంగిక వేధింపులకు గురిచేస్తాడు. ఈ వీడియోలు తన చేతికి చిక్కడంతో మరో శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాధిత మహిళలను వేధించాడు. మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల అసభ్య చేష్టల తాలూకు వీడియోలు వైరల్‌ అవడంతో జీహెచ్‌ఎంసీ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. గాజులరామారం పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటనను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తీవ్రంగా పరిగణించారు. ఫలితంగా మహిళా పారిశుధ్య కార్మికులను వేధింపులకు గురిచేసిన ఇద్దరు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఎ్‌ఫఏలు) కిషన్‌, ప్రణయ్‌లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ వర్గాల సమాచారం ప్రకారం.. కిషన్‌ది మెదక్‌ జిల్లా. కుటుంబసభ్యులతో కలిసి సూరారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్ధానికంగా ఉన్న ఓ చర్చికి పెద్దగా కూడా వ్యవహరిస్తున్నాడు. జీహెచ్‌ఎంసీలో ఐదేళ్లుగా ఎస్‌ఎ్‌ఫఏగా పనిచేస్తున్న కిషన్‌, మూడేళ్లక్రితం కూకట్‌పల్లి సర్కిల్‌ నుంచి గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చాడు.


అతడి వద్ద 21 మంది కార్మికులు ఉండగా, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మహిళల్లో కొందరిని కిషన్‌ బెదిరింపులకు గురిచేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తునే ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించుకునే కిషన్‌, తర్వాత వాటినే బాధితులకు చూపించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడని సమాచారం. కాగా కిషన్‌, తన కుమార్తె పెళ్లి సమయంలో ఫోన్‌ను మరో ఎస్‌ఎ్‌ఫఏ అయిన ప్రణయ్‌ వద్ద ఉంచాడు. ఫోన్లో మహిళా కార్మికుల పట్ల కిషన్‌ చేష్టలను చూసిన ప్రణయ్‌.. ఆ వీడియోలన్నింటినీ తన ఫోన్‌లోకి పంపుకొన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలే ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో కూకట్‌పల్లి జోన్‌లోని గాజుల రామారం సర్కిల్‌ పరిధిలో ఓ పారిశుధ్య కార్మికురాలితో ఎస్‌ఎ్‌ఫఏ కిషన్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్న తాలూకు వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఘటనపై విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్‌ అభిలాష అభినవ్‌ను ఆదేశించారు. దీంతో సర్కిల్‌ డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ హెల్త్‌(ఏఎంవోహెచ్‌) నుంచి ఆమె నివేదిక తెప్పించుకున్నారు. అనంతరం కిషన్‌, ప్రణయ్‌ను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి చర్యల కోసం ఘటనపై పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ప్రణయ్‌ పట్ల మహిళా కార్మికుల్లో కొందరి నుంచి ఫిర్యాదులు అందడం.. వాటిని వాస్తవం అని నిర్ధారించుకున్నాకే అతడినీ విధుల నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. కాగా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఎస్‌ఎ్‌ఫఏల్లో కొందరు మహిళా కార్మికులపై పెత్త చేస్తున్నారని, విధులకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా హాజరు వేయబోమని బెదిరిస్తున్నారని, సెలవులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ.. కోరిక తీర్చాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 24 , 2024 | 04:16 AM