Share News

Watch Video: బాబోయ్ ఏంటీ మహిళ.. బస్సులో ఏకంగా కండక్టర్‌పైనే..

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:43 AM

Telangana: మద్యం ఆరోగ్యాన్నే కాదు.. బుద్దిని పాడు చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మద్యం మత్తులో కొందరు మగవారు చేసే వీరంగం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారి ప్రవర్తన మితిమీరిపోతుంటాయి కూడా.

Watch Video: బాబోయ్ ఏంటీ మహిళ.. బస్సులో ఏకంగా కండక్టర్‌పైనే..

హైదరాబాద్, జనవరి 31: మద్యం ఆరోగ్యాన్నే కాదు.. బుద్దిని పాడు చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మద్యం మత్తులో కొందరు మగవారు చేసే వీరంగం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వారి ప్రవర్తన మితిమీరిపోతుంటుంది కూడా. అయితే ఇక్కడ మాత్రం బస్సులో మద్యం మత్తులో ఓ మహిళ చేసిన బీభత్సానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ప్రవర్తనపై సాటి మహిళలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

బస్సు కండక్టర్‌ను మహిళ కాలితో తన్నిన ఘటన కలకలం రేపుతోంది. మర్డర్ చేసేస్తానంటూ కండక్టర్‌పైనే సదరు మహిళ దాడి చేసింది. హయత్‌నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్‌పై ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్ 1 డిపోకు చెందిన హయత్‌నగర్ నుంచి అప్జల్‌గంజ్ రూట్‌లో నడిచే 72 బస్ సర్వీస్‌లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో బస్ కండక్టర్‌‌ను పచ్చి బూతులు తిడుతూ దాడి చేసింది. అంతే కాకుండా పెద్దాయన అని కూడా చూడకుండా కాలితో తన్నింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినప్పటికీ సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్‌పై దాడికి పాల్పడింది. ఇంత జరుగుతున్నా కండక్టర్ మాత్రం ఒక మహిళ అనే గౌరవంతో సంయమనం పాటించడం హయత్‌నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అద్దం పడుతోంది. అయితే కండెక్టర్‌పై మహిళ దాడికి సంబంధించి హయత్‌నగర్ డిపో అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 31 , 2024 | 01:16 PM