KTR: కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్
ABN , Publish Date - Jul 08 , 2024 | 07:14 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్‌కు సంచలన హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్‌కు సంచలన హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫిర్జాదిగూడలో ప్రజలు నిర్మించుకుంటున్న ఇండ్లను అక్రమంగా కూల్చివేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అన్ననని చెప్పుకుంటున్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంలో సమాచారం తెప్పించుకొని ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన సూచించారు.