Share News

Transfers: తెలంగాణలో 12 మంది ఏఎస్పీల బదిలీ

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:06 PM

తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా పోలీసు శాఖలో భారీగా అధికారులు బదిలీ అయ్యారు. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

Transfers: తెలంగాణలో 12 మంది ఏఎస్పీల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా పోలీసు శాఖలో భారీగా అధికారులు బదిలీ అయ్యారు. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ అడిషనల్ డీసీపీగా ఎస్‌.రమేష్‌ను బదిలీ చేశారు. ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 అడిషనల్‌ డీపీసీగా రామారావు, సైబరాబాద్ క్రైం అడిషనల్ డీపీసీగా శ్రీనివాసులు, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీగా మహ్మద్‌ రెహమాన్‌, నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీగా శివకుమార్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులను ఇచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 07:06 PM