Share News

TS News: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు నేటితో ముగియనున్న గడువు..

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:08 PM

తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు గడువు నేటితో ముగియనుంది. వాహన చలాన్లకు ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. అది ఈ రోజు రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా ముందే చలాన్స్ చెల్లించుకోవాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెబుతున్నారు

TS News: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు నేటితో ముగియనున్న గడువు..

హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు గడువు నేటితో ముగియనుంది. వాహన చలాన్లకు ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. అది ఈ రోజు రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా ముందే చలాన్స్ చెల్లించుకోవాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెబుతున్నారు. మరో సారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీని ప్రకటించింది. అయితే తొలుత ప్రకటించిన ప్రకారమైతే జనవరి 10 తోనే గడువు ముగియాల్సి ఉంది. అయితే పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి భారీగా స్పందన వస్తుండడంతో గడువును జనవరి 31 వరకూ పెంచింది. ఆపై నేటి వరకూ గడువును పొడించింది. సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసు వర్గాలు గతంలో తెలిపాయి. ఈ క్రమంలో నేటితో గడువును పొడిగించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. గతేడాది కూడా రాయితీపై చెల్లించేందుకు పోలీస్ శాఖ వాహనదారులకు అవకాశం ఇవ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది.

Updated Date - Feb 15 , 2024 | 12:08 PM