Share News

Bilkis Bano: సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పిన స్మితా సబర్వాల్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:13 PM

బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

Bilkis Bano: సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పిన స్మితా సబర్వాల్.. ఎందుకంటే..
IAS Officer Smita Sabharwal

హైదరాబాద్, జనవరి 08: బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పిందించిన స్మితా సబర్వాల్.. 'చాలా రోజుల తరువాత మంచి వార్త వచ్చింది. బిల్కిస్ బానో మాత్రమే కాకుండా మహిళలందరిలో విశ్వాసాన్ని పెంచింనందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు స్మితా సబర్వాల్. ఈ మేరకు ఆమె సోమవారం నాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు సోమవారం నాడు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతేకాదు.. నిందితులు రెండు వారాల్లోగా సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యా్ప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆయా రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులంతా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2002లో చోటు చేసుకున్న గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నిందితులైన 11 మందిని సత్ప్రవర్తన కింద ముందుగానే విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. బాధితురాలు బిల్కిస్ బానో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన ధర్మాసనం.. గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ.. నిందితులను మళ్లీ జైల్లో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది.

Updated Date - Jan 08 , 2024 | 08:13 PM