Share News

MLC Kavitha: కవిత పిటిషన్‌పై విచారణలో బిగ్ ట్విస్ట్..!

ABN , Publish Date - Mar 15 , 2024 | 10:35 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ కేసును ఈనెల 19వ తేదీకు (మంగళవారానికి) సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది.

MLC Kavitha: కవిత పిటిషన్‌పై విచారణలో బిగ్ ట్విస్ట్..!

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ కేసును ఈనెల 19వ తేదీకు (మంగళవారానికి) సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. గతంలో కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ చెప్పిందని సుప్రీంకోర్టులో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని అన్నారు. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టులో కేసు పూర్తయ్యే వరకు ఈడీ చెప్పిన బలవంతపు చర్యలు తీసుకోమనే అంశం వర్తిస్తుందని చెప్పారు.

ముందస్తు ప్లాన్‌లో భాగంగా కవితను అరెస్ట్ చేశారని అన్నారు. సోదాల పేరుతో వచ్చి ఈడీ, ఐటీ అధికారులు అరెస్ట్ చేశారని ముందుగానే విమాన టికెట్ బుక్ చేశారని చెప్పారు. కవిత ముందు చాలా న్యాయ అవకాశాలు ఉన్నాయన్నారు. అరెస్ట్‌ను సవాల్ చేస్తామని.. చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. న్యాయవ్యాదులతో చర్చించి రేపు(శనివారం) నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను అరెస్ట్ చేశారని మోహిత్ రావు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 10:53 PM