Share News

ACB: రెండో రోజు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:56 AM

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను రెండవ రోజు గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. నిన్న (బుధవారం) 7 గంటలు పాటు విచారించిన అధికారులు.. ఈరోజు మరోసారి చంచల్ గూడా జైలు నుంచి శివ బాలకృష్ణ ను కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు.

ACB: రెండో రోజు ఏసీబీ కస్టడీకి  శివబాలకృష్ణ

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను రెండవ రోజు గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొనున్నారు. నిన్న (బుధవారం) 7 గంటలు పాటు విచారించిన అధికారులు.. ఈరోజు మరోసారి చంచల్ గూడా జైలు నుంచి శివ బాలకృష్ణ ను కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఏబీసీ అధికారులు శివబాలకృష్ణను ప్రత్యేక గదిలో విచారించి స్టేట్ మెంట్ నమోదుచేస్తున్నారు. నాలుగు బ్యాంకు లాకర్లు, బినామిలు, పెట్టుబడులపై అరాతీస్తున్నారు. ఇల్లీగల్ లే అవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వాటిపై అరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ పెట్టుబడిపెట్టిన రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై అరా తీస్తున్నారు. అలాగే బినామీలు సత్య అండ్ మూర్తితో ఉన్న లింక్స్‌పై కూడా విచారణ చేస్తున్నారు.

కాగా నిన్న (బుధవారం) శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ.. విచారణ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించింది. 7 గంటలపాటు సాగిన విచారణలో దాదాపు 75 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం శివ బాలకృష్ణను ప్రశ్నించింది. ఈ విచారణను వీడియో రికార్డింగ్‌ చేశారు. బుధవారం మొదటి రోజు విచారణలో శివబాలకృష్ణకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అందుకున్న జీతం సహా శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తులపై ఆరా తీశారు. తొలుత కోర్టు అనుమతితో బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్‌లోని తమ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించారు. ప్రత్యేక గదిలో సాయంత్రం 5గంటల వరకు విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం మళ్లీ బాలకృష్ణను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను ముందుంచి ప్రశ్నించారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మై హోం బూజాలో డింగరి కిరణ్‌ ఆచార్య, హనుమకొండ భవానీనగర్‌లో సింగరాజు ప్రమోద్‌కుమార్‌, మాదాపూర్‌ సాహితి సుముఖి ఆర్బిట్‌ ఆపార్ట్‌మెంట్‌, హబ్సిగూడ వీవీనగర్‌లో కొమ్మిడి సందీ్‌పకుమార్‌ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు. బాచుపల్లి శిల్ప ఆర్‌వీ ధరిస్తా అపార్ట్‌మెంట్‌లో జి.సత్యనారాయణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్‌ వివరాలు సేకరించారు. వీటితోపాటు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, కొత్తపేట ఆర్‌కేపురంలోని ఎస్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వివరాలు అడగ్గా వాటితో తనకెలాంటి సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం.

Updated Date - Feb 01 , 2024 | 10:56 AM