Earthquake: హైదరాబాద్‌లో భూకంపం.. కారణం చెప్పిన సైంటిస్ట్
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:32 AM
Telangana: గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని సైంటిస్ట్ శేఖర్ తెలిపారు. ములుగు ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 7:27 గంటలకు ఈ భూకంపం వచ్చిందని.. దీని ప్రభావం ఎక్కువగా ములుగు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలలో చూపించిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహజంగా రిక్టర్ స్కేలు పై 5.3 పాయింట్స్‌గా నమోదు అయ్యిందన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈరోజు (బుధవారం) ఉదయం హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో హైదరాబాద్‌వాసులు ఉండిపోయారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతంలో భూప్రకంపనల వార్త ఈరోజు హైలెట్‌గా నిలిచింది. అయితే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఎన్‌జీఆర్‌ఐ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్. శేఖర్ (NGRI Principal Scientist Dr. Shekhar) క్లారిటీ ఇచ్చారు.
AP News: ఓకేసారి 829 మంది హెడ్మాస్టర్లకు షోకాజ్ నోటీసులు
ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో సైంటిస్ట్ శేఖర్ మాట్లాడుతూ.. గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయన్నారు. ములుగు ప్రాంతంలో ఈ భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 7:27 గంటలకు ఈ భూకంపం వచ్చిందని.. దీని ప్రభావం ఎక్కువగా ములుగు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలలో చూపించిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహజంగా రిక్టర్ స్కేలు పై 5.3 పాయింట్స్‌గా నమోదు అయ్యిందన్నారు. సహజంగా నది పరివాహక ప్రాంతాల్లో వచ్చినప్పుడు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో దీని ప్రభావం ఉంటుందని.. అందువల్లనే హైదరాబాదులో పలుచోట్ల భూమి కనిపించిందని వెల్లండించారు.
ఏనుగుకు తిక్కరేగితే ఇలాగే ఉంటుంది మరీ..
ఇది గోదావరి ములుగు ప్రాంతంలో మొదలై స్వల్పంగా కృష్ణ నదిలో భూకంపం వచ్చిందన్నారు. అలాగే మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతంలో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 రిక్టర్ స్కేలుపై భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై 6లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పులేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు. అలాగే పగుళ్లు ఉన్నటువంటి భవనాలు, పాత భవనాలల్లో ఉండకపోవడమే మంచిదని ఎంజీఆర్‌ఐ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్. శేఖర్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
‘ఫెంగల్’ తుపాను చరిత్రలో కొత్తది..
ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ
Read Latest Telangana News And Telugu News