AP News: ఓకేసారి 829 మంది హెడ్మాస్టర్లకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Dec 04 , 2024 | 10:26 AM
Andhrapradesh: కడప డీఈవో మీనాక్షి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏకంగా 829 మంది హెడ్మాస్టర్లకు డీఈవో షోకాజ్ నోటీసులిచ్చారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల సదరు హెడ్మాస్టర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యకు తామెలా భాద్యులవుతామని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి.
కడప, డిసెంబర్ 4: ప్రధానోపాధ్యాయుల విషయంలో కడప డీఈవో మీనాక్షి (Kadapa DEO Meenakshi) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద సంఖ్యలో ఏకంగా 829 మంది హెడ్మాస్టర్లకు డీఈవో షోకాజ్ నోటీసులిచ్చారు. దీంతో డీఈవో వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. షోకాజ్ నోటీసులు ఇవ్వడం పట్ల సదరు హెడ్మాస్టర్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యకు తామెలా బాధ్యులవుతామని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. హెడ్మాస్టర్లకు నోటీసులపై టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్పందించారు. కడప డీఈఓ వ్యవహారం శైలి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అవడం చర్చనీయాంశంగా మారింది. ఆపార్ నమోదు కార్యక్రమానికి సంబంధించే హెడ్మాస్టర్లకు ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని కడప జిల్లా విద్యాధికారి మీనాక్షి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుపై మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని డీఈవో ఆదేశించారు. సమాధానం పంపకపోతే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా డీఈవో హెచ్చరికలు జారీ చేశారు. అయితే డీఈవో హెచ్చరికలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆపార్ నమోదులో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. సాంకేతిక సమస్యకు తామెలా బాధ్యులము అవుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంత పెద్ద సంఖ్యలో హెడ్మాస్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ అవడం వివాదాస్పదంగా మారింది.
ఆపార్ నమోదులో సమస్యలు..
ఒక దేశం, ఒక స్టూడెంట్ కార్డు పేరుతో జాతీయ నూతన విద్యావిధానం-2020లో భాగంగా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నమోదు కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థి వివరాలు అడ్మిషన్ రిజిస్టర్‌తో పాటు యూడైస్‌లో పొందుపరిచారు. సంబంధిత కోడ్ నమోదు చేయగానే విద్యార్థి వివరాలన్నీ వస్తాయి. అయితే ఆపార్ నమోదు సమయంలో ఆధార్ వినియోగించడం జరుగుతోంది. అయితే ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉండటంతో ఆపార్ నమోదులో సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పేరు, పుట్టినతేదీ, తండ్రి పేర్లు అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్‌లతో వేరువేరుగా ఉండటంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..
Read Latest AP News And Telugu News