Share News

Sania Mirza: కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా..?

ABN , Publish Date - Mar 27 , 2024 | 10:57 AM

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు.

Sania Mirza: కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా..?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) తరఫున పోటీ చేసే ఎంపీ (MP) అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. బుధవారం ఢిల్లీ (Delhi)లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం (Congress Central Election Committee meeting) కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ (Tennis player) సానియా మీర్జా (Sania Mirza) పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆమె పేరును అజారుద్దీన్ (Azharuddin) ప్రతిపాదన చేశారు. అటు సానియా స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు (Congress Leaders) భావిస్తున్నారు. ఎంఐఎంనేత అసదుద్దీన్‌ (Asaduddin)పై సానియా లాంటి ఫేమస్ స్టార్ పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) సానియాతో చర్చించినట్లు సమాచారం.

Updated Date - Mar 27 , 2024 | 11:23 AM