ఈసెట్ కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులకు ఊరట
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:43 AM
టీజీఈసెట్ అభ్యర్థులకు ఊరటనిచ్చేలా సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి రాని కారణంగా కౌన్సెలింగ్‌కు వందల సంఖ్యలో అభ్యర్థులు దూరమవుతున్న అంశంపై ‘ఈసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి అధికారులు స్పందించారు.

హెల్ప్‌లైన్ కేంద్రాలకు చేరిన డిప్లొమా పాసైన వారి డేటా
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి విద్యాశాఖ అధికారుల స్పందన
హైదరాబాద్ సిటీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): టీజీఈసెట్ అభ్యర్థులకు ఊరటనిచ్చేలా సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి రాని కారణంగా కౌన్సెలింగ్‌కు వందల సంఖ్యలో అభ్యర్థులు దూరమవుతున్న అంశంపై ‘ఈసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి అధికారులు స్పందించారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థుల డేటాను అన్ని హెల్ప్‌లైన్ కేంద్రాలకు పంపించారు. ఈసెట్ కౌన్సెలింగ్ హాజరయ్యేందుకు అవసరమైన క్రెడిట్స్ (పాస్) అభ్యర్థికి ఉన్నాయో, లేదోనన్నది హెల్ప్‌లైన్ కేంద్రాల సిబ్బంది తెలుసుకునేందుకు వీలు కల్పించారు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ సులువైంది. అలాగే పదో తరగతి మెమో, స్టడీ సరిఫికెట్లు పాలిటెక్నిక్ కళాశాలల్లో సమర్పించిన అభ్యర్థులు.. ఆయా సంస్థల నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్లు తెచ్చినా అనుమతించాలని హెల్ప్‌లైన్ కేంద్రాలకు సాంకేతిక విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. విద్యార్హతల ధ్రువపత్రాలే కాకుండా ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు ఒరిజినల్స్ లేకున్నా ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ చేయాలని సూచించినట్లు సమాచారం.