Share News

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

ABN , Publish Date - Jun 08 , 2024 | 06:56 AM

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..
Ramoji Rao

హైదరాబాద్: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.


దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు.


1936 నవంబర్‌ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ‘ఈనాడు’ దినపత్రికను ప్రారంభించారు.

Updated Date - Jun 08 , 2024 | 08:03 AM