Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:05 PM

Radisson Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది...

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో డ్రగ్స్ దొరికింది కాబట్టి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రాడిసన్‌లో 1200, 1204 రూముల్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహారం హోటల్ అవరణలోనే జరిగింది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్‌పైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు.. డ్రగ్స్ పార్టీ అని తెలిసి కూడా అనుమతి ఇవ్వడంతో హోటల్ యాజమాన్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు తేలే అవకాశం ఉంది.


రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

డ్రగ్ ఫెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడీ రిపోర్టు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా చూడొచ్చు.ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్‌కు పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ డ్రగ్స్‌ను అందజేశారు. మీర్జా నుంచి 4 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్నట్లు గుర్తించాం. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్‌‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు గుర్తించాం అని రిమాండ్ రిపోర్టులో ఉంది.

drugs.jpg

మళ్లీ క్రిష్ పేరు!

ఇదిలా ఉంటే.. మిర్జా రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును రిపోర్టులో ప్రస్తావించడం జరిగింది. ఈనెల 29న గచ్చిబౌలి ఐఎస్‌బీ వద్ద నాలుగు కవర్లలో కొకైన్‌ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో A13 అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ పెడ్లర్‌తో ఏడాదిగా మీర్జా పరిచయం అయినట్లు పోలీసు విచారణలో తేలింది. స్నాప్‌చాట్ ద్వారా పరిచయం చేసుకొని డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. ఇప్పటి వరకూ రాడిసన్ హోటల్‌లో మోత్తం 10 సార్లు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెండు గ్రాములకు రూ. 30 వేలకు పైగానే గూగుల్ పే ద్వారా నగదు చెల్లించినట్లు కూడా తేలింది. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు ఉన్నారని.. వారందరికీ మీర్జా‌నే ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి ఐఎస్‌బీ, జూబ్లీహిల్స్‌లో కొకైన్‌ను అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తానికి చూస్తే.. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.

radissonhoteldrugscase.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 04:09 PM