Share News

Crime News: దుండిగల్‌లో ప్రాణాల మీదకు తెచ్చిన అక్రమ సంబంధం..

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:23 PM

అక్రమ సంబంధం(illicit Relationship) ఇద్దరి ప్రాణాలకు మీదకు తెచ్చిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలో చోటు చేసుకుంది. రూమ్ కి ఆలస్యంగా వచ్చిందని ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు.

Crime News: దుండిగల్‌లో ప్రాణాల మీదకు తెచ్చిన అక్రమ సంబంధం..

హైదరాబాద్: అక్రమ సంబంధం(illicit Relationship) ఇద్దరి ప్రాణాలకు మీదకు తెచ్చిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్‌ గోమడిమైసమ్మకు చెందిన వ్యక్తికి చింతల్‌కు చెందిన మహిళకు చాలా రోజులుగా అక్రమ సంబంధం నడుస్తోంది. ఎప్పటిలాగే ప్రియురాలికి ఫోన్ చేసి ప్రియుడు తన రూమ్‌కు రమ్మన్నాడు. అతడి వద్దకు వస్తున్న సమయంలో ఆమె ఫోన్ కంటిన్యూగా కాల్ వెయిటింగ్ రావడం, ప్రియురాలు ఆలస్యంగా తన రూమ్‌కు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. అనంతరం అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్త్రావంతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రియుడిని సైతం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For more Telangana news and Telugu news click here...

Updated Date - Jun 05 , 2024 | 03:24 PM