Share News

TS NEWS: హబీబ్‌నగర్ ఎస్ఐ శివపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:44 PM

హబీబ్‌నగర్ ఎస్ఐ శివపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐ శివను సస్పెండ్ చేస్తూ శుక్రువారం సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

TS NEWS: హబీబ్‌నగర్ ఎస్ఐ శివపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: హబీబ్‌నగర్ ఎస్ఐ శివపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐ శివను సస్పెండ్ చేస్తూ శుక్రువారం సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్‌లో సగం కాలిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యం అయింది. మృతురాలు మల్లేపల్లి‌కి చెందిన యువతిగా గుర్తించారు. అయితే ఈనెల 10వ తేదీన కూతురు మిస్ అయిందని ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. కాగా కేసు నమోదు చేయడంలో ఎస్ఐ శివ అలసత్వం వహించారు. ఈ విషయం తెలియడంతో నేడు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. కేసు వివరాలపై సీపీ కొత్తకోట శ్రీనివాసురెడ్డి ఆరా తీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ఎస్సై శివపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు హబీబ్‌నగర్ ఇన్స్‌పెక్టర్‌కి సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మెమోను జారీచేశారు.

Updated Date - Jan 12 , 2024 | 10:44 PM