Share News

TS News: శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో భారీగా విమానాలు రద్దు.. కారణమిదే

ABN , Publish Date - Jan 17 , 2024 | 09:39 AM

Telangana: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాలు రద్దు అయ్యాయి. పొగమంచు కారణంగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో దాదాపు 37 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు.

TS News: శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో భారీగా విమానాలు రద్దు.. కారణమిదే

హైదరాబాద్, జనవరి 17: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో పలు విమానాలు రద్దు అయ్యాయి. పొగమంచు కారణంగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో దాదాపు 37 విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా విపరీతంగా పొగ మంచు ఏర్పడింది. దీంతో శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 17 , 2024 | 09:39 AM