Share News

TS ICET: ఐసెట్‌ దరఖాస్తులకు గడువు పొడిగింపు

ABN , Publish Date - May 02 , 2024 | 08:43 PM

తెలంగాణలో ఐసెట్‌ (TS ICET) దరఖాస్తులకు గడువు పొడిగించారు.మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

TS ICET: ఐసెట్‌ దరఖాస్తులకు గడువు పొడిగింపు
(TS ICET

హైదరాబాద్‌: తెలంగాణలో ఐసెట్‌ (TS ICET) దరఖాస్తులకు గడువు మరోసారి పొడిగించారు. మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మే 7వ తేదీ వరకు గడవును పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు.

ఆలస్య రుసుం లేకుండా మంగళవారం వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్‌ 5, 6 తేదీల్లో జరిగే ఈ పరీక్షకు రూ. 250 ఆలస్య రుసుంతో మే 17 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో మే 27 వరకు దరశాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. మే 28న హాల్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జూన్‌ 28న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 08:47 PM