Share News

MLC Kavitha: నేడు కోర్టుకు కవిత.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:01 AM

ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.

MLC Kavitha: నేడు కోర్టుకు కవిత.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!
MLC Kavitha

ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది. దీంతో శనివారం కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. ఇదే సమయంలో కవితను మరో ఐదు రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి కవితను మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా.. లేదంటే జ్యూడిషియల్‌ రిమాండ్‌కు పంపిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత బెయిల్‌ కోసం కవిత కుటుంబ సభ్యులతో పాటు.. బీఆర్ఎస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్‌పై కూడా ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత షెడ్యూల్ ఇదే..!

ఇద్దరినీ కలిపి..

ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండటంతో.. కవితను, ఆయనను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తేదీన కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించారు. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆమెను ఈనెల 23 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారం రోజులుగా కవిత ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉంటున్నారు. ఈరోజుతో ఆమె ఈడీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు. ఈడీ కస్టడీ కోరకపోతే.. న్యాయమూర్తి జ్యూడిషియల్ రిమాండ్‌కు విధిస్తారా.. లేదా బెయిల్‌ మంజూరు చేస్తారా అనేది సాయంత్రానికి క్లారిటీ రానుంది.

కవిత ఏమన్నారంటే..

మరోవైపు కవిత విషయంలో ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆమె తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈడీ మాత్రం అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కవితను అరెస్ట్ చేశామని చెబుతోంది. ఈ క్రమంలో కవిత విషయంలో ఏం జరగబోతుందనేది వేచిచూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 09:01 AM