Share News

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

ABN , Publish Date - Apr 03 , 2024 | 09:00 PM

రెరా మాజీ కార్యదర్శి శివ బాలక‌ష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయక పోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Hyderabad:శివబాలకృష్ణ బెయిల్.. ఆ పొరపాటు వలనే..

రెరా మాజీ కార్యదర్శి శివ బాలక‌ష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ ఏడాది జనవరి 25న శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోవడంతో శివబాలకృష్ణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణను కోర్టు ఆదేశించింది. శివబాలక‌ృష్ణ సోదరుడు శివ నవీన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అంతకుముందు బెయిల్ కోసం శివబాలక‌ృష్ణ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కోర్టు కొట్టేసింది.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్టయ్యారు. ఆయన వద్ద రూ.250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ పేరిట, బినామీల పేరిట 214 ఎకరాల భూమి, ఏడు ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడించింది. ఇప్పటివరకు బయటపడిన ఆయన ఆస్తుల విలువ రూ.250 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.


AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 09:00 PM