Share News

Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు..

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:03 PM

హైదరాబాద్: ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారని పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. షేక్‌పేట్ తహశీల్దార్ అనితా రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో ఫ్లాట్ నెం. 8-సీలో 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి ఉంది.

Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు..

హైదరాబాద్: ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారని పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. షేక్‌పేట్ తహశీల్దార్ అనితా రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో ఫ్లాట్ నెం. 8-సీలో 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని దీప్తీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉపేందర్ రెడ్డి, మరికొందరు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్లాట్ నెం. 8-డీలో షౌకత్ ఉన్నీషా అనే వ్యక్తి నుంచి ఉపేందర్ రెడ్డి ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దాని పక్కనే 8-సీ కూడా తనదేనని కబ్జా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.

గతంలో ఈ స్థలంలో దీప్తీ అవెన్యూ కంపెనీ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహశీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోసారి అదే స్థలంలో ఉపేందర్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారు. దీంతో బంజాహిల్స్ పోలీసుల సహకారంతో తహశీల్దార్ అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది.

Updated Date - Jan 01 , 2024 | 01:03 PM