Share News

TS NEWS: డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు.. కారణమేంటంటే..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 06:17 PM

తెలంగాణ డీజీపీ రవిగుప్తా(DGP Ravigupta)ను బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మంగళవారం నాడు కలిశారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలో నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TS NEWS: డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు.. కారణమేంటంటే..?

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ రవిగుప్తా(DGP Ravigupta)ను బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మంగళవారం నాడు కలిశారు. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలో నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాలపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నిన్న మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో ఆయన ప్రోద్భలంతో భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు దాడి చేశారని వివరించారు.

ఈ దాడిలో బాద్యులైన ఎస్ఐతోపాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. డీజీపీ రవిగుప్తా సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, భాస్కర్‌రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ చైర్‌పర్సన్ దీపిక, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 06:17 PM