Share News

BJP: మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం బీజేపీ నేతల ప్రయత్నాలు

ABN , Publish Date - Feb 09 , 2024 | 08:21 AM

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సీటు కోసం బీజేపీ జాతీయ నేతలను కలసి పోటీచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్ కోసం జాతీయ నేతలను కలసిన వారిలో...

BJP: మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం బీజేపీ నేతల ప్రయత్నాలు

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ‌ సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సీటు కోసం బీజేపీ జాతీయ నేతలను కలసి పోటీచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్ కోసం జాతీయ నేతలను కలసిన వారిలో ఈటల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్.. మరోవైపు మల్కాజ్‌గిరి టికెట్ రేసులో అరడజను మంది నేతలు ఉన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఈటల, చాడా సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మురళీదరరావు, పన్నాల హరీష్ రెడ్డి, మల్కా కొమరయ్య తదితరులు ఉన్నారు.

కాగా తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుందని తెలియవచ్చింది. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించారు. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరు ఖరారు అయినట్టేనని పలువురు చెబుతున్నారు.

Updated Date - Feb 09 , 2024 | 08:21 AM