Share News

TG News: బాచుపల్లిలో దారుణం.. భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త.. ఆపై..

ABN , Publish Date - May 24 , 2024 | 09:35 PM

మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలుపెరిగిపోతున్నాయి. ఇంటా బయట ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. కఠిన చట్టాలు వస్తున్న కొంతమంది దుర్మార్గుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి దారుణాలు ఎక్కడో ఓ చోట జరుగుతునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో విషాద ఘటన జరిగింది.

TG News: బాచుపల్లిలో దారుణం.. భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త.. ఆపై..

హైదరాబాద్: మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇంటా బయట ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. కఠిన చట్టాలు వస్తున్న కొంతమంది దుర్మార్గుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి దారుణాలు ఎక్కడో ఓ చోట జరుగుతునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో విషాద ఘటన జరిగింది.


నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య మధులతను భర్త అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని స్థానికులు భయభ్రాంతులకు గురువుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రంగనాయకులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..

‘‘సాయి అనురాగ్ కాలనీలో భార్య మధులతను భర్త నాగేంద్ర భరద్వాజ అతి దారుణంగా హత్యచేశాడు. ఆమె సాప్టేవేర్ ఇంజనీర్‌గా‌ ఓ ఎమ్మెన్సీ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. కుటుంబ కలహాలతో ఆమెను హత్య చేశాడు. భార్య మధులతను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేయడానికి భర్త ప్రయత్నించాడు. అదికాకుండా గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. మధులత తండ్రి రంగ నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం అని’’ పోలీసులు తెలిపారు. కాగా.. ఈనెల 5 తేదీన ఈ ఘటన జరిగినట్లు బాచుపల్లి పోలీసులు నిర్ధారించారు..నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - May 24 , 2024 | 09:44 PM