Share News

Hyderabad: 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు దారుణం..

ABN , Publish Date - Jan 08 , 2024 | 09:53 AM

హైదరాబాద్: ఉప్పల్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 3వ తేదీన ఉప్పల్‌ బస్ స్టాప్ వద్ద బస్సు ఎక్కేందుకు బాలిక ఎదురుచూస్తోంది.

Hyderabad: 16ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు దారుణం..

హైదరాబాద్: ఉప్పల్‌లో 16 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 3వ తేదీన ఉప్పల్‌ బస్ స్టాప్ వద్ద బస్సు ఎక్కేందుకు బాలిక ఎదురుచూస్తోంది. అయితే తెలిసిన వాళ్ళలాగా ఇంటికి తీసుకెళ్తానంటూ సాదక్ అనే వృద్దుడు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఆ బాలిక ఇంటికి ఆలస్యంగా రావడం.. ఇంట్లో మౌనంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బాలికను మందలించడంతో విషయం తల్లికి చెప్పింది. అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడు సాదక్‌ను గుర్తించి అరెస్టు చేశారు. పాతబస్తీకి చెందిన షేక్‌ సాదక్‌ (60) ఉప్పల్‌ బస్టాండు ప్రాంతంలోని ఓ కట్టెల మిషన్‌లో పనిచేస్తున్నాడు. నిందితుడుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 08 , 2024 | 09:53 AM