Share News

Hyderabad: శంషాబాద్‌ పరిధిలో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే...

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:15 AM

కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(Joel Davis) తెలిపారు.

Hyderabad: శంషాబాద్‌ పరిధిలో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే...

హైదరాబాద్‌ సిటీ: కన్హా శాంతివనం సందర్శనకు నేడు భారత ఉప రాష్ట్రపతి రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(Joel Davis) తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌(Hyderabad) నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్‌ వయా పెద్దగోల్కొండ మీదుగా ఇండియన్‌ బేకరీ(తొండుపల్లి), బుర్జుగడ్డ వద్ద యూటర్న్‌ తీసుకొని ముచ్చింతల్‌, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్‌, తిమ్మాపూర్‌(Ameerpet, Timmapur), షాద్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు. అలాగే, గచ్చిబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పెద్దగోల్కొండ టోల్‌గేట్‌, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్‌, తిమ్మాపూర్‌, షాద్‌నగర్‌ మీదుగా మళ్లిస్తారు. షాద్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌తోపాటు పెంజర్ల ఎక్స్‌రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అమీర్‌పేట్‌ మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు నుంచి పెద్దగోల్కొండ టోల్‌గేట్‌, శంషాబాద్‌, హైదరాబాద్‌ వైపు మళ్లిస్తారు. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పైన తెలిపిన ప్రాంతాల్లోనే ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్‌ సీపీ పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.

Updated Date - Mar 16 , 2024 | 11:15 AM