Hyderabad: ఆ రెండు కిలోమీటర్లు అంధకారం..
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:41 PM
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పక్క నుంచి టీఎన్‌జీఓ్‌స కాలనీకి రోడ్డును నిర్మించి రెండేళ్లు పైగా అయింది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు ఆధునిక వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ రోడ్డులో రాత్రిపూట రాకపోకలు సాగించాలంటే ప్రజలు జంకుతున్నారు.

- దోపిడీలు, దొంగతనాలకు ఆస్కారం
- విద్యుత్ స్తంభాలు వేశారు.. వీధి దీపాలు మరిచారు
- రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పక్క నుంచి టీఎన్‌జీఓస్ కాలనీకి రోడ్డును నిర్మించి రెండేళ్లు పైగా అయింది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు ఆధునిక వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ రోడ్డులో రాత్రిపూట రాకపోకలు సాగించాలంటే ప్రజలు జంకుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: HYDRA: ఏడాది చివరిలోనూ హడలెత్తించిన హైడ్రా
టీఎన్‌జీఓస్ కాలనీ నుంచి..
టీఎన్‌జీఓ్‌స కాలనీ అలైబలై చౌరస్తా నుంచి ఐఎస్బీ మీదుగా విప్రో కూడలి, ట్రిపుల్‌ఐటీ రోడ్డుకు అనుసంధానిస్తూ 60 అడుగు ల వెడల్పు రోడ్డు నిర్మించారు. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చేవారు అటు విప్రో కూడలి, క్యూసిటీ వైపునకు రాకుండా ఐఎస్బీ పక్క నుంచే టీఎన్‌జీఓస్ కాలనీకి నేరుగా వెళ్లేలా ఈ దారి అందుబాటులోకి తెచ్చారు. సుమారు రెండు కిలోమీటర్లు ఉండే ఆ దారిలో ఒకవైపు ఐఎ్‌సబీ, మరోవైపు గచ్చిబౌలి క్రీడా ప్రాంగణం ఉంటుంది. రోడ్డు నిర్మాణ సమయంలోనే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్తంభాలు, వాటికి విద్యుత్ దీపా ల ఏర్పాటుకు కొక్కేలు బిగించి వదిలేశారు.
దారికి రెండువైపులా నిర్జన ప్రదేశం ఉంటుంది. టీఎన్‌జీఎస్ కాలనీలో పదుల సంఖ్య లో వసతి గృహాలు ఉన్నాయి. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ఐటీ కారిడార్లలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ దారిగుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కీలక దారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయక పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో దొంగతనాలకు, దోపిడీలకు ఆస్కారం ఉంటుందని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?