Share News

Hyderabad: ఉచిత విద్యుత్‌ ఇంటికి రూ.1.75 లక్షల బిల్లు..

ABN , Publish Date - May 05 , 2024 | 11:13 AM

ఎండలు మండిపోతున్నాయి. కరెంట్‌ వాడకం రికార్డుస్థాయిలో పెరిగింది. అయితే, మల్కాజిగిరి(Malkajigiri)లో ఓ వినియోగదారుడికి ఏప్రిల్‌ నెల విద్యుత్‌ బిల్లు ఏకంగా రూ.1,75,173 వచ్చింది. విద్యుత్‌శాఖ జారీచేసిన ఒక్కనెల బిల్లు చూసి ఆ వినియోగదారుడు షాకయ్యాడు.

Hyderabad: ఉచిత విద్యుత్‌ ఇంటికి రూ.1.75 లక్షల బిల్లు..

హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. కరెంట్‌ వాడకం రికార్డుస్థాయిలో పెరిగింది. అయితే, మల్కాజిగిరి(Malkajigiri)లో ఓ వినియోగదారుడికి ఏప్రిల్‌ నెల విద్యుత్‌ బిల్లు ఏకంగా రూ.1,75,173 వచ్చింది. విద్యుత్‌శాఖ జారీచేసిన ఒక్కనెల బిల్లు చూసి ఆ వినియోగదారుడు షాకయ్యాడు. వసంతపురికాలనీకి చెందిన జూలూరి నవీన్‌కుమార్‌(Juluri Naveen Kumar) ఇంటికి సంబంధించి గతనెలలో జీరో బిల్లుకు అర్హుడయ్యాడు. కాగా, ఏప్రిల్‌ నెలలో జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ. 1.75 లక్షల బిల్లురావడంతో ఖంగుతిన్నాడు.

ఇదికూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అలా చేస్తే ఆ ఛార్జీలు రద్దు..

ఏప్రిల్‌ 7 నుంచి మే 4 వరకు 17,533 యూనిట్ల విద్యుత్‌ వాడినట్లు బిల్లులో చూపించి ఎనర్జీ చార్జీల కింద రూ.1,73,971, ఎలక్ర్టిసిటీ డ్యూటీ కింద రూ.1051, ఇతర చార్జీలతో కలిపి మొత్తం రూ.1.75,173 బిల్లు జారీచేశారు. జీరో బిల్లు రాకపోయినా సరేనని, ఇప్పుడు లక్షల్లో బిల్లు ఎలా ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించాడు. మీటర్‌ రీడర్‌ చేసిన పొరపాటు వల్ల అధిక బిల్లు వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సవరించిన బిల్లు రూ.1,438ను వినియోగదారుడికి అందజేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Read Latest Telangana News and National News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 11:13 AM