Share News

Hyderabad: భారీగా పెరిగిన పప్పుల ధరలు...

ABN , Publish Date - May 24 , 2024 | 11:30 AM

పప్పుల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా మార్కెట్‌లో వంట నూనెలు, కూరగాయలు, కాస్మోటిక్స్‌(Oils, Vegetables, Cosmetics) ధరలు తరచూ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. ఈసారి విచిత్రంగా వంటనూనెల కంటే పప్పుల రేట్లు గరిష్టస్థాయికి పెరగడం ఆందోళనకరంగా మారింది.

Hyderabad: భారీగా పెరిగిన పప్పుల ధరలు...

- రిటైల్‌ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.180

- శనగపప్పు కిలో రూ.90కి చేరిన వైనం

- అదే స్థాయిలో మినప్పప్పు, చింతపండు..

- పేదలపై నిత్యావసర వస్తువుల భారం

నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు కూరగాయల రేట్లతో పరేషాన్‌ అయిన పేద, మధ్య తరగతి ప్రజలు ప్రస్తుతం అమాంతంగా పెరిగిన పప్పుల ధరలతో హడలిపోతున్నారు. కంది, పెసర, శనగ, మినప్పప్పు లాంటివి కిలోకు రూ.30 నుంచి 40 వరకు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ: పప్పుల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా మార్కెట్‌లో వంట నూనెలు, కూరగాయలు, కాస్మోటిక్స్‌(Oils, Vegetables, Cosmetics) ధరలు తరచూ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. ఈసారి విచిత్రంగా వంటనూనెల కంటే పప్పుల రేట్లు గరిష్టస్థాయికి పెరగడం ఆందోళనకరంగా మారింది. మార్చినెలలోని రేట్లతో పోల్చితే ప్రస్తుతం వివిధ రకాల పప్పుల ధర రూ.30కి పైగా పెరిగింది. వాస్తవంగా ప్రతి కుటుంబంలో కూరగాయలతో సమానంగా పప్పులను వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో పప్పు కూరలను తగ్గించి కూరగాయలపై దృష్టి సారిస్తున్నారు. పప్పు కూరలు కావాలని పిల్లలు మారాం చేస్తున్నప్పటికీ.. సర్దిచెబుతూ కూరగాయలతో భోజనం అందిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 50 మంది నకిలీ వైద్యులు.. తనిఖీల్లో గుర్తించిన అధికారులు


ధరల పెరుగుదల ఎందుకు?

కందిపప్పు నగరంతోపాటు ఇతర ప్రాంతాలకు ఆస్ర్టేలియా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్‌ పప్పులతో పోల్చితే విదేశీ సరుకు రేట్లు తక్కువగా ఉండడంతో 2 నుంచి 3 శాతం లాభం చూసుకుని అమ్మకాలు చేపడుతుంటామని పేర్కొంటున్నారు. రెండు నెలలుగా ఆస్ర్టేలియా నుంచి కందిపప్పు దిగుమతి బాగా తగ్గడంతో మహారాష్ట్ర, లాతూరు నుంచి వచ్చే పప్పులకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో హోల్‌సేల్‌ వ్యాపారులు కిలోకు రూ.10 చొప్పున పెంచి అమ్ముతుండగా, రిటైల్‌ మార్కెట్‌లో కిలోకు రూ.20-30 వరకు అదనంగా పెంచి దండుకుంటున్నారు. నగర శివారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదనంగా రూ.40 వరకు పెంచి అమ్ముతున్నారు. కాగా, కందిపప్పుతోపాటు మినపపప్పు, శనగపప్పు, చింతపండు ధరలు పెరగడంతో ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


ధరలు భారంగా మారాయి

కిరాణ సామాను ధరలు భారంగా మారాయి. రేట్లు పెరగడంతో కూలీ, నాలీ చేసుకునే మాలాంటి కుటుంబాలు తట్టుకోలేక పోతున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు అన్నీ పెరుగుతున్నాయి. కంది పప్పును కొనే పరిస్థితి కనిపించడం లేదు.

- భాగ్యరేఖ, గృహిణి, బోయినపల్లి

తక్కువ కొనుగోలు చేస్తున్నారు

రెండు నెలలుగా పప్పుల రేట్లు గరిష్టంగా పెరిగాయి. కిలోకు రూ.20 నుంచి 30 వరకు పెరిగింది. దీంతో గతంలో నెలకు 5 కిలోల వరకు తీసుకునే కందిపప్పును కొంతమంది రెండు కిలోలే తీసుకుంటున్నారు. ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పలేం.

- జగన్‌మోహన్‌, హోల్‌సేల్‌ వ్యాపారి, మలక్‌పేట్‌


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 11:30 AM