Hyderabad: బీఆర్ఎస్కు ‘బాబా’ గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి ఫసియుద్దీన్
ABN , First Publish Date - 2024-02-09T13:31:46+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియా శీల కార్యకర్తగా, నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్(Borabanda Corporator Baba Fasiuddin) బీఆర్‌ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియా శీల కార్యకర్తగా, నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్(Borabanda Corporator Baba Fasiuddin) బీఆర్‌ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో గురువారం ఆ పార్టీలో చేరారు. కాగా, బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించిన లేఖలో వెల్లడించారు. 2022లో విద్యార్థి దశలో ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చినప్పుడు ఆకర్షితుడైన ఫసియుద్దీన్ అందులో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 22 ఏళ్లుగా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ.. అగ్రనాయకులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదనకు గురవుతున్న బాబా ఫసియుద్దీన్ గురువారం బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.