Share News

Hyderabad: పేరుకు ఫాస్ట్‌ఫుడ్‌.. అమ్మేది గంజాయి

ABN , Publish Date - Sep 26 , 2024 | 07:57 AM

అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌(Fast food center) మాటున గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 6.75 కిలోల గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: పేరుకు ఫాస్ట్‌ఫుడ్‌.. అమ్మేది గంజాయి

- రెండు చోట్ల ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ దాడులు

- 8.5 కిలోల గంజాయి పట్టివేత

- మరో ఘటనలో కాఫీ షాప్‌లో హుక్కా పట్టివేత

హైదరాబాద్‌ సిటీ: అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌(Fast food center) మాటున గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 6.75 కిలోల గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టీఎఫ్‌ టీమ్‌ లీడర్‌ ప్రదీప్‏రావు, డీఎస్పీ తిరుపతియాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కిశోర్‌దాస్‌(Kishordas) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రామచంద్రాపురంలో పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. అధికంగా సంపాదించాలన్న ఆశతో ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి తెచ్చి ఫాస్ట్‌ఫుడ్‌ మాటున గంజాయి విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌పై దాడిచేసి కిశోర్‌దా్‌సను అరెస్టు చేసి అతడి నుంచి 6.75 కేజీల గంజాయి, రూ.7100 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మిస్డ్ కాల్.. ఓ బిజినెస్సే!


హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి

కాపీ షాపు మాటున హుక్కా పార్లర్‌ నిర్వహిస్తున్న నిర్వాహకులు సహా.. ఏడుగురిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 19 హుక్కాపాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ మిజమ్మిల్‌ ఊల్ఫ్‌ కేఫ్‌ అండ్‌ లాంజ్‌ పేరుతో కాపీ షాపు నడుపుతున్నాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కాఫీ షాపు మాటున హుక్కా పార్లర్‌ నిర్వహిస్తున్నాడు. నిషేధిత నికోటిన్‌తో హుక్కా సెంటర్‌ నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర తన బృందంతో దాడిచేసి మహమ్మద్‌ మిజమ్మిల్‌ సహా ముగ్గురు నిర్వాహకులు, నలుగురు వినియోగదారులను అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు.

city2.2.jpg


మరో కేసులో..

ధూల్‌పేట జాలి హనుమాన్‌ ప్రాంతానికి చెందిన గణేశ్‌సింగ్‌, ఉమేశ్‌సింగ్‌ కూకట్‌పల్లి సర్కిల్‌లో గంజాయి అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి గణేశ్‌సింగ్‌ను అరెస్టు చేసి 1.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఉమేశ్‌సింగ్‌ పరారీలో ఉన్నాడు.


ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..

ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2024 | 07:57 AM