Share News

Hyderabad: చెత్తకుప్పలో రోజుల పసి కందు..

ABN , Publish Date - Dec 28 , 2024 | 08:00 AM

మానవత్వం లేని మనుషులు రోజుల పసి బాలుడిని చెత్తకుప్పలో వేసి చేతులు దులుపుకున్నారు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఓ కవర్లో చుట్టి పడేసి వెళ్లిపోయారు.

Hyderabad: చెత్తకుప్పలో రోజుల పసి కందు..

- నిలోఫర్‌ ఆస్పత్రిలోని శిశు విహార్‌లో అందజేత

హైదరాబాద్: మానవత్వం లేని మనుషులు రోజుల పసి బాలుడిని చెత్తకుప్పలో వేసి చేతులు దులుపుకున్నారు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఓ కవర్లో చుట్టి పడేసి వెళ్లిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖైరతాబాద్‌(Khairatabad) మారుతీనగర్‌ వెంకటలక్ష్మమ్మ దేవాలయం వద్ద అయ్యప్పస్వామి పూజకు వచ్చిన పోతుల కనకరాజు అనే స్థానికుడు మూత్ర విసర్జన కోసం సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌ మార్గానికి వెళ్లగా, అక్కడ చెత్తకుప్పల మధ్య పసిపాప ఏడుపు వినిపించింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మన్మోహన్‌సింగ్‌ మద్దతు లేకుంటే హైదరాబాద్‌ మెట్రో లేదు..


దగ్గరకు వెళ్లి చూడగా బియ్యం సంచి, అందులో మరో ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి ఉన్న మగశిశువు కనిపించాడు. అతడి సమాచారం మేరకు స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికంగా ఆరా తీసినా వివరాలు తెలియకపోవడంతో బాలుడిని నీలోఫర్‌ ఆస్పత్రి(Nilofar Hospital)లోని శిశువిహార్‌లో అప్పగించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 08:00 AM