Share News

Kalyana Lakshmi: కల్యాణలక్ష్మికి 1450 కోట్లు విడుదల

ABN , Publish Date - Aug 22 , 2024 | 06:08 AM

కల్యాణలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం రూ. 1450 కోట్లు విడుదల చేసింది. 2024- 25 సంవత్సరానికి గాను నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

Kalyana Lakshmi: కల్యాణలక్ష్మికి 1450 కోట్లు విడుదల

  • తాజాగా దరఖాస్తు చేసుకున్న

  • వారికి ఈ నిధుల నుంచి చెల్లింపులు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి పథకం కోసం ప్రభుత్వం రూ. 1450 కోట్లు విడుదల చేసింది. 2024- 25 సంవత్సరానికి గాను నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కల్యాణలక్ష్మి కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిఽధుల నుంచి చెల్లింపులు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ బుధవారం జీవో జారీ చేసింది. కాగా, ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 1,00,116 ప్రయోజనం అందుతుంది.

Updated Date - Aug 22 , 2024 | 06:08 AM