Share News

TG News: చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Apr 19 , 2024 | 06:31 PM

చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

TG News: చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.


CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు

సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమార్లు అక్కడి కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు

స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలను క్లియర్ చేయాలని సూచించారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు.


TS Politics: బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?

రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభయాన్ యూనిఫాంల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు మరియు సైజింగ్ కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపులకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.


Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 07:26 PM