Share News

GHMC: హైదరాబాద్ వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:58 PM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో వ్యాపారం నిర్వహిస్తున్న యాజమానులకు GHMC అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ డిసెంబర్ 31, 2023తో ముగిసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొత్తగా జనవరి 31, 2024లోపు ఆయా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.

GHMC: హైదరాబాద్ వ్యాపారులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో వ్యాపారం నిర్వహిస్తున్న యాజమానులకు GHMC అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ డిసెంబర్ 31, 2023తో ముగిసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొత్తగా జనవరి 31, 2024లోపు ఆయా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. చెల్లింపు తర్వాత ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని అన్నారు. ఇది జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్ర ఈనెల 14న షురూ..వీటిపైనే పోరాటం!


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నార్మ్స్ (EODB) అమలుపై MA&UD జూన్ 22, 2017 నాటి G.O.Rt.No.459 ప్రకారం పునరుద్ధరణ ధరను చెల్లించిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆటోమేటిక్‌గా పునరుద్ధరించబడుతుందని తెలిపారు. అంతేకాదు ఈనెలలోగా రెన్యూవల్ చేసుకోవడంలో విఫలమైతే అదనంగా మరింత రుసుం చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు.

ghmc.JPG

లైసెన్స్ రుసుముతో పాటు, ట్రేడ్ లైసెన్స్ రుసుము రూ. 5000 వరకు ఉన్న ట్రేడ్‌లపై 10% మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు 5000 కంటే ఎక్కువ ట్రేడ్ లైసెన్స్ రుసుము ఉన్న ట్రేడ్‌లపై రూ.1000 విధించబడుతుందన్నారు. అన్ని ట్రేడ్‌లకు తెలంగాణ గ్రీన్ ఫండ్‌గా ప్రతి కొత్త లైసెన్స్ లేదా ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ ఉంటుందని ప్రకటించారు.


జూలై 27, 2017 నాటి రిజల్యూషన్ నెం.19 ప్రకారం లైసెన్సు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమయంలో వ్యాపారికి 100% జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. దీంతోపాటు 10% జరిమానా కూడా విధించబడుతుందని స్పష్టం చేశారు.

Updated Date - Jan 11 , 2024 | 04:00 PM