Share News

Electricity: ఆ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:42 AM

మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యాన్సర్‌ ఆస్పత్రి, కమలాపురి కాలనీ ఫీడర్ల పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10(Banjara Hills Road No. 10), ఆదాయపన్ను శాఖ క్వార్టర్స్‌, ఐఏఎస్‌ క్వార్టర్స్‌, క్యాన్సర్‌ ఆస్పత్రి, సత్యసాయి కల్యాణ మండపం, కమలాపురి కాలనీ, తన్వీర్‌ ఆస్పత్రి ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సినీ ఘర్‌, కమ్మ సంఘం ఫీడర్ల పరిధిలోని ఒమేగా ఆస్పత్రి, నాగార్జున నగర్‌, విజయ టవర్స్‌ ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Kamareddy: కామారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు.. పట్టణంలో హైటెన్షన్..


గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ(Greenland ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మున్సిపల్‌ మార్కెట్‌, బీఎస్‌ పురి కాలనీ ఫీడర్ల పరిధిలోని అపరాజిత కాలనీ, సాదత్‌ మంజిల్‌, ఎంసీహెచ్‌ మార్కెట్‌, గౌతమ్‌ పురి కాలనీ(Gautam Puri Colony), మిడ్ల్యాండ్‌ బేకరీ, బీఎస్‌ పురి కాలనీ, నటరాజ్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రాజీవ్‌ గాంధీ సర్కిల్‌, కీర్తిలాల్‌ జ్యూవెల్లర్స్‌, గణేష్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలోని శ్రీనివాస్‌ టవర్స్‌, ఆమోగ్‌ ప్లాజా, మైటాస్‌, గణేష్‌ నగర్‌, ేస్నహపురి కాలనీ, మోతినగర్‌, బబ్బుగూడ ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 06:42 AM