Share News

Kavitha Arrest: ఏడో రోజు కవిత విచారణ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లలో మేనల్లుడి పాత్రపై ఆరా

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:09 PM

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) మనీలాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఏడో రోజు కస్టడీలో ఉన్నారు. నేటితోనే (23/03/24) కస్టడీ పూర్తవ్వాల్సింది కానీ.. కవితను విచారించేందుకు మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Kavitha Arrest: ఏడో రోజు కవిత విచారణ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లలో మేనల్లుడి పాత్రపై ఆరా

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) మనీలాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఏడో రోజు కస్టడీలో ఉన్నారు. నేటితోనే (23/03/24) కస్టడీ పూర్తవ్వాల్సింది కానీ.. కవితను విచారించేందుకు మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. కవితను కలిసేందుకు ఆమె భర్త అనిల్, పెద్ద కుమారుడు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితమే తల్లి, కుమారుల్ని కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం చిన్న కొడుకుతో పాటు ఇతర బంధువులు కవితను కలిశారు. వారితో పాటు న్యాయవాది మోహిత్‌రావు కూడా కలిసి.. ఆమెకు ధైర్యం చెప్పారు. మరోవైపు.. మాదాపూర్‌లో కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాలు ముగిశాయి. శనివారం ఉదయం నుంచి వాళ్లు ఈ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత మెనల్లుడి (అనిల్ సోదరి కుమారుడు) పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.


ఇదిలావుండగా.. ఈడీ విచారణ సమయంలో కవిత తీవ్రమైన రక్తపోటును ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్‌ఏ కోర్టులో (PMLA Court) ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాను మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, వైద్య పరీక్షల నివేదికలను ఈడీ అధికారులు అందించడం లేదని అందులో పేర్కొన్నారు. వైద్య పరీక్షల నివేదికలు ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని, మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈనెల 15వ తేదీ నుంచి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా ఆరు రోజుల పాటు కస్టడీలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 09:09 PM