Share News

Congress Vs BJP: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి ధర్మపురి అర్వింద్ సవాల్

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:10 PM

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) బీజేపీ (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన సవాలు విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Indian general election-2024) జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్దమని అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేకనే జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జీవన్ రెడ్డి నాకు తండ్రి సమానుడు. ఆయన ఎదురుపడిన ప్రతిసారి వంగి ఆశీర్వాదం తీసుకుంటాను. సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదు’’ అంటారు.

Congress Vs BJP: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి ధర్మపురి అర్వింద్ సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) బీజేపీ (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన సవాలు విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Indian general election-2024) జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్దమని అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేకనే జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జీవన్ రెడ్డి నాకు తండ్రి సమానుడు. ఆయన ఎదురుపడిన ప్రతిసారి వంగి ఆశీర్వాదం తీసుకుంటాను. సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరైంది కాదు. జగిత్యాలలో బీజేపీ బలపడుతుండడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 నుంచి ఇదే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెబుతున్నారు. జీవన్ రెడ్డితో రాజకీయంగా కొట్లాడటానికి నేను సిద్ధం’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీలు, నేతల మధ్య పరస్పర మాటల దాడి పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

YCP: విజయనగరంలో వైసీపీకి భారీ షాక్

Bonda Uma: జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు

Updated Date - Feb 19 , 2024 | 03:10 PM