Padmanabha Reddy: ‘పాలమూరు-రంగారెడ్డి’ లో అవకతవకలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:22 AM
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

సమగ్ర విచారణ జరిపించాలి: ఎఫ్‌జీజీ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 2015లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాల్సి ఉందని, కానీ తొమ్మిదేళ్లవుతున్నా పూర్తికాలేదని తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.32,200 కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెరిగిందని, కేంద్రం నుంచి తగిన అనుమతులు పొందని కారణంగా ప్రాజెక్టుపై రూ.920 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు.
ఇప్పటికే ప్రాజెక్టుపై రూ.31,850 కోట్లు ఖర్చు చేశారని, మరో నాలుగైదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదన్నారు. దీని కోసం పలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తెచ్చారని, ప్రస్తుతం వడ్డీలు చెల్లించలేక ప్రభుత్వం సతమతమవుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై విచారణ జరిపించి, బాధ్యులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.