Share News

Logo Launch: మూసీ ప్రాజెక్టుకు అధికారిక లోగో

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:03 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం శనివారం లోగోను విడుదల చేసింది.

Logo Launch: మూసీ ప్రాజెక్టుకు అధికారిక లోగో

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం శనివారం లోగోను విడుదల చేసింది. ఇందులోపైన వంతెన, కింద మూసీ అని ఇంగ్లీషు అక్షరాలతో రాసి ఉంది. ఈ లోగోకు ‘ఓన్‌ అవర్‌ ఓన్‌ మూసీ’ అని ట్యాగ్‌లైన్‌ను జత చేసింది.


మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అధికారిక చిహ్నంగా దీనిని ఖరారు చేసింది. ఇకపై మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించే అధికారిక పత్రాలు, ఉత్తర ప్రత్యుత్తరాలపై ఈ లోగో దర్శనమివ్వనుంది. దీంతో పాటు ప్రభుత్వ చిహ్నం ఉంటుంది.

Updated Date - Oct 20 , 2024 | 03:03 AM